#EXISTENTIALISM #FEAR #DEATH #ABSURD #Question సామాజిక ఆలోచనలు ఎలా మార్పు చెందుతాయో చెప్పారు. వ్యక్తిగతంగా ఈ లాక్-డౌన్ సమయంలో ఎలా మన మెంటల్ హెల్త్ ని ధృడపరచాలో చెప్పండి ప్లీజ్... #Answer మనస్సుని ధృడ పరచుకోవడమే నా క్లయింట్స్ నా ఎగ్జిస్టెన్షల్ కౌన్సిలింగ్ ద్వారా పొందేది. దాదాపుగా 15 నుండి 20 సెషన్స్ ఆ వ్యక్తిని బట్టి అవసరమవుతాయి. ఒక కాన్సెప్ట్ కి మరో కాన్సెప్ట్ అనుసంధానమై ఉంటాయి. కేవలం ప్రశ్నకు సమాధానం చెప్పడం వలన మరికొన్ని ప్రశ్నలు ఉద్భవించే అవకాశముంటుంది. అయినప్పటికీ క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. #మనిషి తన జీవితాన్ని జీవించడం లేదు. కేవలం చనిపోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. లేదా ఓడిపోకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి అక్కడ ఏ విధమైన పోటీలేదు. ఈ క్రమంలో మనిషి చావు నుంచి పారిపోవడాన్ని, ఓటమి నుంచి పారిపోవడాన్ని జీవితమని పొరబడుతూ చివరికి చావు భారిన పడుతున్నాడు. ఈ ప్రకృతిలో మనిషి తప్ప మరే జీవి కూడా చావు భయంతో గాని, ఓటమి భయంతో గాని బ్రతకడం లేదు. ఆపద వచ్చినపుడు అప్పటికప్పుడు ప్రతి స్పందిచడం ద్వారా ఎదుర్కొంటున్నాయి తప్ప అవి రేపు చనిపోతానేమో అనే భయంతో బ్రతకడం లేదు. #భయం చావు కన్నా హీనమైనది. మనిషి భయానికి లోనయినపుడు అతని మెదడు మొద్దుబారి, శరీరం తన సహజ స్థితిని కోల్పోయి బిగుసుకు పోతుంది. అటువంటి సమయంలో ఆలోచన లోపించిన మనిషి మరింత భయానికి లోనవుతాడు. ఇక ఆ భయం మరికొంత భయానికి ఆజ్యం పోస్తుంది. ఈ విధంగా ఒక ఊబిలోన చిక్కుకు పోయి ఉన్న కొద్దీ పాటి జీవితాన్ని కూడా దుర్భరం చేసుకుంటాడు. భయానికి కారణం #ఆలోచన తీరు. ఆలోచన తీరు పెరిగిన వాతావరణం వలన వస్తుంది. ఇప్పుడున్న స్థితి వద్దు మరో స్థితి కావాలనే కోర్కె ఆలోచనకు మూలం. ఇప్పుడున్న స్థితిని అంగీకరించలేక పోవడం భయానికి మూలం. భయం నుంచి స్వేచ్ఛ పొందాలి. ధైర్యం భయం నుండి బయట పడేస్తుందని భావిస్తాము. కానీ అది కేవలం నమ్మకం మాత్రమే. అది మరి కొంత భయానికి కారణం అవుతుంది. నిజానికి ధైర్యం అంటూ ఏమీ ఉండదు. ఉన్నదల్లా భయం కలిగి ఉండడం లేదా భయం లేక పోవడం మాత్రమే. ధైర్యం కేవలం విశ్వాసం మాత్రమే. భయం నుండి విముక్తి కేవలం #సంసిద్ధత ద్వారా మాత్రమే లభిస్తుంది. ధైర్యం అనే భ్రమను కూడగట్టు కోవడం కంటే మనిషి జరిగే నష్టానికి మానసికంగా సిద్దపడినపుడు భయాన్ని జయించ గలుగుతాడు. భయాన్ని జయించిన మనిషి మెదడు అతని ఆలోచనకు సహకరిస్తుంది. సంసిద్ధత అంటే ఆ విషయంలో వచ్చే నష్టానికి సిద్దపడి ఉండడం. ఉదాహరణకు చావు, లేదా ఓటమి. వాటికి సిద్దపడినపుడు వచ్చే #బాధ వల్ల మనిషి భయపడు తుంటాడు. బాధ మనిషి జీవితంలో ఒక భాగం. ఎంత పారిపోయినా బాధ మనిషిని ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. బాధ రూపం మారుతుంది తప్ప బాధ నుండి విముక్తి మాత్రం రాదు. ఒక కొత్త బాధ పాత బాధను మాన్పిస్తుంది. ఉదాహరణకు లాక్ డౌన్ రాగానే అప్పులోళ్ల బాధ, EMIల బాధ (ఉన్న వాళ్లకు) తగ్గుతుంది. లాక్ డౌన్ తీసివేస్తే లాక్ డౌన్ బాధ పోయి మళ్ళీ ఆ బాధలు ప్రారంభమవుతాయి. రూపం మార్చుకునే బాధ నుంచి పారిపోవడం కంటే ఎంత బాధ వస్తే అంతగా దానిని అనుభవించడం ద్వారా దానిని జీవితానికి ఉపయోగించుకోవచ్చు. రెండు సంవత్సరాల పాటు రెస్టు లేకుండా 2000 పైగా క్లయింట్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల విపరీతమైన ఒత్తిడిలో ఉన్న నాకు ఈ లాక్ డౌన్ కావలసినంత రెస్ట్ ఇచ్చింది. ఈ ఖాళీ సమయంలో నేను పియానో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది సఫలీకృతం కావచ్చు లేదా విఫలం కావచ్చు. కానీ నేను ఆనందించ గలుగుతున్నాను. ఎప్పుడయితే దానిని సఫలీకృతం చేసుకునే ప్రయత్నం చేస్తానో వెంటనే కోర్కె, కోర్కె నుంచి భయం ఇలా మొత్తం సీన్ రిపీట్ అవుతుంది. ఏముంటే దానినే తినడం, దానినే అనుభవించడం. ఇది జీవితాన్ని జీవించడానికి ఉన్న సులువైన మార్గం. అది మొక్కుబడిగా చెయ్యడం కాదు. చెయ్య కూడదనీ కాదు. ఇష్టమైనది చేస్తాము. చేసేదే ఇష్టపడతాము. ఎలా కుదిరితే అలా చేస్తాము. నేను బ్రతకాలనే కోర్కెతో బ్రతకడం లేదు. దాని అర్థం నాకు చావాలని ఉంది అని కూడా కాదు. కేవలం బ్రతుకు ఉంది కాబట్టి బ్రతుకుతున్నాను. వినటానికి వింతగా ఉంటుంది. అర్థం చేసుకోడానికి సంక్లిష్టంగా ఉంటుంది. అయినా చెప్పే ప్రయత్నం చేసాను. #HariRaghav 28.03.2020